సంబంధిత వార్తలు

ములుగు జిల్లాలో అనూహ్యఘటన జరిగింది. మంగంపేట మండలంలో 45 మంది మహిళలు పొలంలో వరినాట్లు వేస్తుండగా పక్కనే ఉదృతంగా ప్రవహిస్తున్న ముసలమ్మ వాగు ఒక్కసారిగా పొంగి పొలాలను ముంచెత్తింది. దాంతో పొలంలో ఉన్న మహిళలు ఆ నీళ్ళలో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరయ్యారు. విషయం తెలుసుకొన్న గ్రామస్తులు పరుగున వచ్చి వారిని తాళ్ళ సహాయంతో మెల్లగా బయటకు లాగారు. పొలంలో పనిచేసుకొంటున్న వారిని రక్షించేందుకు సుమారు 3-4 గంటలు సమయం పట్టిందంటే ముసలమ్మ వాగు ఎంత ఉదృతంగా ప్రవహించిందో అర్ధం చేసుకోవచ్చు.