
తెరాస ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ద్వంద పౌరసత్వం కేసుపై న్యాయపోరాటం చేస్తున్న కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్, హైకోర్టు ఆదేశానుసారం చెన్నమనేని భారతీయ పౌరుడా కాదా అనే విషయం తేల్చేయాలని కేంద్రహోంశాఖను కోరారు. ఈ కేసుపై కేంద్రప్రభుత్వం మరొకసారి పునరాలోచించుకొని మూడు నెలలోగా తుది నిర్ణయం ప్రకటించాలని హైకోర్టు జూలై 10వ తేదీన కేంద్రహోంశాఖను ఆదేశించింది. కానీ ఈ కేసు విషయంలో కేంద్రహోంశాఖ ఇంతవరకు స్పందించకపోవడంతో, ఆది శ్రీనివాస్ మళ్ళీ మరోసారి గుర్తుచేసి, వీలైనంత త్వరగా దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని కోరుతూ కేంద్రహోంశాఖ ఉన్నతాధికారులకు ఇటీవల ఒక వినతిపత్రం అందించారు. చెన్నమనేని రమేశ్‌కు భారత్, జర్మనీ రెండు దేశాల పౌరసత్వం ఉంది. కానీ రమేశ్ ఆ విషయాన్ని దాచిపెట్టి ఎన్నికలలో పోటీ చేశారని, అది ఎన్నికల నియమావళికి విరుద్దం కనుక ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.