అధికార లాంఛనాలతో నేడు జైపాల్ రెడ్డి అంత్యక్రియలు

సీనియర్ కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. సిఎం కేసీఆర్‌తో సహా పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెరాస, కాంగ్రెస్‌, బిజెపి, టిడిపి, వామపక్షాలకు చెందిన పలువురు నేతలు, వివిద రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆదివారం జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్ళి శ్రద్దాంజలి ఘటించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్ధం ఆయన భౌతికకాయాన్ని నాంపల్లిలోని గాంధీభవన్‌కు తరలిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి.