హైదరాబాద్‌ మెట్రోపై పుకార్లేల?

హైదరాబాద్‌ మెట్రోలో మియాపూర్-ఎల్బీ నగర్ కారిడార్‌లో శనివారం మధ్యాహ్నం సుమారు అర్ధగంటసేపు రైళ్ళ రాకపోకలను నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో లక్డీకాపూల్ నుంచి ఒక ఖాళీ రైలు వెనక్కు తిరిగి వస్తుండటంతో అది రాంగ్ ట్రాకులో ప్రయాణించిందని, డ్రైవరు సకాలంలో ఆ పొరపాటును గుర్తించి ప్రయాణికులను లక్డీకాపూల్ స్టేషన్ వద్ద దించివేసి రైలును వెనక్కు తీసుకువచ్చాడని జోరుగా పుకార్లు మొదలైపోయాయి. వాటిపై మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కూడా వెంటనే స్పందించారు. కొన్ని అత్యవసర మరమత్తుల కోసమే అర్ధగంటసేపు సర్వీసులను నిలిపివేశామని, మెట్రోలో ఎటువంటి పొరపాటు, ప్రమాదమూ జరుగలేదని స్పష్టం చేశారు. దయచేసి ఇటువంటి పుకార్లను వ్యాపింపజేయవద్దని విజ్ఞప్తి చేశారు.