
సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు గవర్నర్ నరసింహన్‌పై ఎప్పుడూ విమర్శలు గుప్పిస్తుండటమే తప్ప మెచ్చుకొన్న సందర్భం ఒకటీ కనబడదు. కానీ మొట్టమొదటిసారిగా ఆయన గవర్నర్ నరసింహన్‌ను ప్రశంశించారు. దేనికంటే కొత్త మున్సిపల్ చట్టంలో సవరణలు చేయాలంటూ ప్రభుత్వానికి వెనక్కు తిప్పి పంపినందుకు! హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఇన్నేళ్లుగా కేసీఆర్ భజనలో తరించిపోయిన గవర్నర్ నరసింహన్, వెళ్ళిపోయే ముందు ఒక మంచిపని చేశారు. పురపాలక చట్టాన్ని వెనక్కు తిప్పి పంపించి తన పదవీకాలంలో మొట్టమొదటిసారిగా ఒక మంచిపని చేశారు. అందుకు ఆయనకు అభినందనలు తెలుపుతున్నాను,” అని అన్నారు.
ఈరోజు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రారంభించిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ ఛాలెంజ్ లో భాగంగా హాజీపూర్ భాధితకుటుంబాలను ఆదుకోవాలని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. సిఎం కేసీఆర్ తన స్వగ్రామం చింతమడక ప్రజలపై వరాలజల్లు కురిపించి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసినట్లుగానే రాష్ట్రంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలని కేసీఆర్‌కు వి.హనుమంతరావు విజ్ఞప్తి చేశారు.