సిఎం కేసీఆర్‌ రేపు చింతమడక పర్యటన

 సిఎం కేసీఆర్‌ సోమవారం తన స్వగ్రామమైన చింతమడక పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని తన బాల్య స్నేహితులు, మిత్రులు, గ్రామప్రజలను కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకొంటారు. అనంతరం వారందరితో కలిసి అక్కడే భోజనం చేస్తారు. సిఎం కేసీఆర్‌ పర్యటన కోసం మాజీ మంత్రి హరీష్‌రావు జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, స్థానిక అధికారులతో కలిసి అవసరమైన అని ఏర్పాట్లు చేశారు. సిఎం పర్యటన సందర్భంగా జిల్లా పోలీసులు చింతమడక గ్రామంలో అక్కడకు వెళ్ళే దారిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సిఎం కేసీఆర్‌ తన స్వగ్రామంలో ప్రజలను కలిసేందుకు వస్తున్నందున, పార్టీ నేతలు, కార్యకర్తలు, ఇతరులు ఎవరూ ఆయనకు ఇబ్బంది కలిగించవద్దని హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు.