టెస్కో ఛైర్మన్‌గా చింత ప్రభాకర్ నియామకం

తెలంగాణ రాష్ట్ర చేనేత పారిశ్రామికుల సహకార సంస్థ (టెస్కో) ఛైర్మన్‌గా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పేరును సిఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. సిఎం కేసీఆర్‌ స్వయంగా నిన్న ఆయనకు ఈవిషయం తెలియజేసినట్లు తెరాస నేతలు తెలిపారు. ఆయన నియామక ఉత్తర్వులు నేడో రేపో వెలువడే అవకాశం ఉంది.