రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ నాగిరెడ్డి సోమవారం హైదరాబాద్‌లో తన కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “మున్సిపల్ ఎన్నికలలో ఒక్కో పోలింగ్ బూత్‌కు 800 మంది చొప్పున సుమారు 50 లక్షల మంది ఓటర్లు పాల్గొనబోతున్నారని అంచనా వేస్తున్నాము. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా ఓటర్ల జాబితాను సిద్దం చేస్తున్నాము. జూలై 14వ తేదీన ఓటర్ల జాబితాను ప్రకటిస్తాము. అదే రోజున రిజర్వేషన్లు కూడా ఖరారు చేస్తాము. ఈ ఎన్నికలను బ్యాలెట్ పత్రాలతోనే నిర్వహించబోతున్నాము. ఎన్నికల డ్రాఫ్ట్ బుదవారానికి సిద్దం అవుతుంది. ఎన్నికలకు 15 రోజుల ముందు నోటిఫికేషన్ విడుదల చేస్తాం. మున్సిపల్, వార్డుల జాబితాపై 12వ తేదీ వరకు అభ్యంతరాలు తెలియజేయవచ్చు. గతంలో వినియోగించిన పోలింగ్ కేంద్రాలలోనే ఈసారి కూడా పోలింగ్ నిర్వహిస్తాము,” అని తెలిపారు.