వరి, పత్తి, మొక్కజొన్న రైతులకు శుభవార్త

వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, కంది, పెసర,మునుము రైతులకు శుభవార్త. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో నిన్న డిల్లీలో జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో అన్నదాతలకు ఉపశమనం కల్పిస్తూ 14 రకాల పంటలకు కనీస మద్దతుధరలను పెంచింది. ఈ ధరలు 2019-20 ఖరీఫ్ సీజనుకు వర్తిస్తాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. 

వరి (సాధారణ రకం)పై కనీస మద్దతుధర రూ.65 పెంచింది. దాంతో వరి క్వింటాల్ ధర రూ.1,815 అయ్యింది. వరి (మేలురకం) పై రూ. 65 పెంచడంతో ధాని ధర రూ.1,835 అయ్యింది. వివిద పంటలకు పెంచిన మద్దతు ధరలు ఈవిధంగా ఉన్నాయి.

  

పంట

గత ఏడాది ధర

పెంచిన మొత్తం

తాజా ధర

వరి (సాధారణ రకం)

1,1750

65

1,815

వరి (మేలు రకం)

1,770

65

1,835

జొన్న (హైబ్రీడ్)

2,430

120

2,550

జొన్న (మాల్దండి)

2,450

120

2,570

మొక్కజొన్న

1,700

60

1,760

పత్తి (మధ్యస్థం)

5,150

105

5,255

పత్తి (పొడవు రకం)

5,450

100

5,550

నువ్వులు

6,429

236

6,485

వేరుశనగ

4,890

200

5,090

కందులు

5675

125

5,800

మునుములు

5,600

100

5,700

పెసర

6,975

75

7,050

పొద్దుతిరుగుడు

5,388

262

5,650

రాగులు

2,897

253

3,150

సజ్జలు

1,950

50

2,000