సంబంధిత వార్తలు

హైదరాబాద్‌లో మొజంజాహీ మార్కెట్ వద్ద బుదవారం ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. మార్కెట్ జంక్షన్ సిగ్నల్ వద్ద బస్సు మలుపు తిరుగుండగా ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోతే బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం జరుగలేదు కానీ బస్సు డ్రైవరుతో సహ కొంతమంది ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. వారిని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, క్రేన్ సహాయంతో బస్సును మళ్ళీ లేపి నిలబెట్టి పక్కకు తరలించారు. ఆ బస్సు (టిఎస్01 జెడ్0146) అదిలాబాద్ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు.