
పాత సచివాలయం స్థానంలో కొత్త సచివాలయం నిర్మిచేందుకుగాను డీ బ్లాక్ వెనుకభాగంలో ఉదయం 11 గంటలకు సిఎం కేసీఆర్ గురువారం శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, తెరాస నేతలు, అధికారులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న సచివాలయానికి దాదాపు రెట్టింపు వైశాల్యంలో సుమారు 4-6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉండేవిధంగా సుమారు 400 కోట్లు వ్యయంతో కొత్త సచివాయలయం నిర్మించాలని సిఎం కేసీఆర్ భావిస్తున్నారు. దీనికోసం సచివాలయం పక్కనే ఉన్న విద్యుత్ తదితర శాఖల భవనాలను, ఉద్యోగ సంఘాల భవనాన్ని కూడా కూల్చివేయవచ్చునని తెలుస్తోంది. మంత్రి ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన త్రిసభ్యమంత్రివర్గ కమిటీ నివేధిక సమర్పించగానే దాని ఆధారంగా కూల్చివేతపనులు ప్రారంభించి, దసరానాటికల్లా నిర్మాణపనులు మొదలుపెట్టాలని సిఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అప్పటికి వర్షాకాలం పూర్తవుతుంది కనుక నిర్విరామంగా నిర్మాణపనులు జరుగుపుకోవచ్చు. దసరాలోగా సచివాలయం భవనం డిజైన్, నిర్మాణానికి టెండర్లు, బడ్జెట్ కేటాయింపులు అన్ని సిద్దం అవుతాయి కూడా.