
తెలంగాణ రాష్ట్రంలో కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలులోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయితీలకు చెక్ పవర్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరికీ కలిపి ఉమ్మడి చెక్ పవర్ మంజూరు చేసింది. వారు గ్రామసభలు నిర్వహించి గ్రామంలో అవసరాలు, వాటి ప్రాధాన్యతలను బట్టి బ్యాంకుల నుంచి నిధులు డ్రా చేసి ఖర్చు చేయవలసి ఉంటుంది. అవసరాలు, ప్రాధాన్యతలు, ఖర్చులు, వాటి పద్దుల నిర్వహణకు సంబందించి నిర్ధిష్టమైన నిబందనలు, మార్గదర్శకాలను కొత్త పంచాయతీరాజ్ చట్టంలో స్పష్టంగా పేర్కొనబడింది. పంచాయతీ వ్యవస్థలో జరుగుతున్న ఈ మార్పుల కారణంగా గత అనేక నెలలుగా చెక్ పవర్ నిలిపివేయడంతో గ్రామాలలో పనిచేసేవారికి చెల్లింపులు...ఆకారణంగా పనులు కూడా నిలిచిపోయాయి. ముఖ్యంగా గ్రామాలలో పారిశుద్ధవ్యవస్థ బాగా దెబ్బతింది. ఇప్పుడు గ్రామ పంచాయితీలకు చెక్ పవర్ మంజూరు చేయడంతో త్వరలోనే రాష్ట్రంలో అన్ని గ్రామాలలో పనులు జోరందుకోవచ్చు.