నేడు తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం

ఈనెల 17 నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలవబోతున్నందున, నేడు ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనుంది. సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో తెరాస లోక్‌సభాపక్ష నేతను ఎన్నుకొనున్నారు. తెరాస సీనియర్ ఎంపీ కవిత, వినోద్ కుమార్, బూర నర్సయ్య గౌడ్ ఎన్నికలలో ఓడిపోవడం, గత లోక్‌సభలో తెరాస పక్ష నేతగా వ్యవహరించిన జితేందర్ రెడ్డి బిజెపిలో చేరిపోవడం వలన ఇప్పుడు తెరాస లోక్‌సభాపక్ష నేతగా నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, పసునూరి దయాకర్ రావు ముగ్గురులో ఎవరో ఒకరిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో నామా నాగేశ్వరరావు గతంలో టిడిపి లోక్‌సభాపక్ష నేతగా వ్యవహరించిన అనుభవం ఉన్నందున ఆయనకే ఎక్కువ అవకాశం ఉన్నట్లు సమాచారం.