నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

 నేటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 10.30 గంటలకు శాసనసభలోని తన ఛాంబర్లో అడుగుపెడతారు. అక్కడ వేదపండితుల ఆశీర్వచనాలు అందుకున్న తరువాత 11.05 గంటలకు శాసనసభలో ప్రవేశిస్తారు. 

ఈరోజు ఉదయం 11.00 గంటల నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. ముందుగా తాత్కాలిక స్పీకర్ అప్పలనాయుడు జగన్‌ చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఆ తరువాత ప్రదాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు చేత చేయిస్తారు. అనంతరం వైసీపీ, టిడిపి సభ్యులందరి చేత ప్రమాణస్వీకారాలు చేయిస్తారు. రేపు స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఎల్లుండి ఉభయసభల సభ్యులను ఉద్దేశ్యించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగిస్తారు. శని,ఆదివారాలు అసెంబ్లీ సమావేశాలకు విరామం ఉంటుంది. మళ్ళీ సోమవారం నుంచి మూడు రోజులపాటు జరిగే సమావేశాలలో గవర్నర్‌ ప్రసంగంపై చర్చ, ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలా వద్దా అనే విషయం బీఏసి సమావేశంలో నిర్ణయిస్తారు. ఒకవేళ పొడిగించకపోతే మళ్ళీ జూలై నెలలో బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తారు. వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం ఏపీ అసెంబ్లీ స్పీకరు కాబోతున్నారు.