కాంగ్రెస్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

 కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల అభ్యర్ధన మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సీఎల్పీని తెరాసలో విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ కేసులో శాసనసభ స్పీకర్, కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, తెరాసలో చేరిన 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. వారందరికీ హైకోర్టు నోటీసులు పంపిచ్చినట్లు సమాచారం. ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నేతలు న్యాయస్థానాన్ని కోరారు. కాంగ్రెస్‌ నేతలు ఒకపక్క హైకోర్టులో న్యాయపోరాటం సాగిస్తూనే మరోపక్క కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. దానిపై కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా నిర్ణయం తీసుకోవలసి ఉంది.