15.jpg)
రేపు జూన్ 2న తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా సిఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 5 సం.లు పూర్తయి రేపు 6వ సం.లోకి అడుగుపెడుతున్నాము. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. అత్యంత కీలకమైన మొదటి 5సం.లలో బంగారి తెలంగాణ ఏర్పాటుకు సరైన, బలమైన అడుగులుపడటంతో, కేవలం 5 ఏళ్ళ వ్యవదిలోనే రాష్ట్రం అన్ని రంగాలలో పురోగతి సాదించి దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రజలకు ఇంకా మెరుగైన పారదర్శకమైన పాలన, సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా చిత్తశుద్దితో పనిచేస్తోంది. ఈ మహాయజ్ఞoలో రాష్ట్ర ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరుకొంటున్నాను. తెలంగాణ సాధన కోసం తమ ప్రాణాలను బలిపెట్టిన అమరవీరులకు ఈ సందర్భంగా నివాళులు ఆర్పిస్తున్నాను,” అని అన్నారు.