నేడు గవర్నర్ రేపు కేసీఆర్‌ ఇఫ్తార్ విందు

రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా ఉభయ రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ శనివారం సాయంత్రం 7 గంటలకు రాజ్‌భవన్‌లో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రా, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌లతో సహా పలువురు మంత్రులు, వివిద రంగాలకు చెందిన ప్రముఖులు, ముస్లిం మతపెద్దలు హాజరుకానున్నారు. 

తెలంగాణ ప్రభుత్వం తరపున సిఎం కేసీఆర్‌ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, వివిద రంగాలకు చెందిన ప్రముఖులు, మజ్లీస్ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, ముస్లింలు హాజరుకానున్నారు.