సంబంధిత వార్తలు

ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈరోజు సాయంత్రంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. తెరాస అభ్యర్ధిగా కూర్మయ్యగారి నవీన్‌రావు నామినేషన్ ఒక్కటే ఉన్నందున ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు ఆయనకు దృవపత్రం అందించారు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు సిఎం కేసీఆర్‌గారికి నవీన్‌రావు కృతజ్ఞతలు తెలియజేసుకొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎస్ మల్లారెడ్డి తదితరులు నవీన్‌రావుకు అభినందనలు తెలియజేశారు.