సంబంధిత వార్తలు

మాజీ కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యపరిస్థితి గురించి మీడియాలో వస్తున్న ఊహాగానాలను బిజెపి ఖండించినప్పటికీ ఆయనే స్వయంగా వాటిని దృవీకరించడం విశేషం. ఈరోజు ప్రధాని నరేంద్రమోడీకి వ్రాసిన ఒక లేఖలో గత 18 నెలలుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, దాని కోసం చికిత్స తీసుకొంటున్నానని తెలిపారు. తనకు ఇంకా వైద్య చికిత్సలు జరుగుతున్నందున కొంత కాలంపాటు కొత్త ప్రభుత్వంలో తాను ఎటువంటి బాధ్యతలు చేపట్టలేనని తెలియజేశారు. గత ప్రభుత్వంలో తనకు స్థానం కల్పించి గౌరవించినందుకు ప్రధాని నరేంద్రమోడీకి అరుణ్ జైట్లీ కృతజ్ఞతలు తెలిపారు.