
ఈనెల 19న జరుగబోయే లోక్‌సభ చివరిదశ ఎన్నికలకు నేటి సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగుస్తుంది. నిబందనల ప్రకారం పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందుగా ఎన్నికల ప్రచారం ముగించవలసి ఉంటుంది కనుక మరో గంటన్నరలో ఎన్నికల ప్రచారం ముగియబోతోంది.
మే 19న బీహార్, ఛండీఘడ్, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, పంజాబ్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలోని 59 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగబోతోంది. మే 23న ఓట్లు లెక్కించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తుంటారు.
ఈసారి లోక్‌సభ ఎన్నికలలో బిజెపి 310 స్థానాలు గెలుచుకొంటుందని ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకొంటున్నప్పటికీ ఎదురీదుతునట్లే కనిపిస్తోంది. గత ఎన్నికలలో ఏ మోడీ ప్రభంజనంతో బిజెపి గెలిచ్చిందో ఇప్పుడు అదే మోడీ పట్ల ప్రజలలో ఏర్పడిన వ్యతిరేకత, ప్రాంతీయ పార్టీల ఐకమత్యం కారణంగా బిజెపి ఎన్నికలలో చాలా చమటోడ్చవలసి వస్తోంది. మోడీ పట్ల వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి వరంగా మారిందని చెప్పవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచే అవకాశాలు లేకపోవడం విశేషం. ఆ సంగతి కాంగ్రెస్ పార్టీ కూడా బాగానే గ్రహించింది. అందుకే మిత్రపక్షాలను... వాటి మిత్రులను కూడగట్టుకొంటోంది.