
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ పంప్‌హౌస్‌లలో అమర్చిన భారీ పంప్ మోటర్లకు ‘వెట్ రన్’ పరీక్షలు నిర్వహిస్తున్నందున భారీగా విద్యుత్ వినియోగం అవుతోంది. వర్షాలు మొదలైన తరువాత జూన్-జూలై నుంచి అన్ని మోటర్లు పూర్తిస్థాయిలో నిరంతరంగా పనిచేయడం మొదలుపెడితే విద్యుత్ వినియోగం మరింత పెరుగుతుంది. కనుక వాటికి అవసరమైన విద్యుత్ సరఫరా చేసేందుకు రామగుండం ఎన్టీపీసీలో 1600 మెగావాట్స్ సామర్ధ్యం కలిగిన ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. దాని నిర్మాణపనుల పురోగతిని పరిశీలించేందుకు సిఎం కేసీఆర్ రేపు అంటే శనివారం రామగుండం వెళ్లబోతున్నారు. ఆ సందర్భంగా ఎన్టీపీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మరుసటిరోజున కాళేశ్వరం ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించినా తరువాత మేడిగడ్డ, కన్నెపల్లి వద్ద జరుగుతున్నా ప్రాజెక్టు పనులను పరిశీలించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.