10.jpg)
స్థానిక సంస్థల కోటాలో ఈ నెల 30వ తేదీన జరగునున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు తెరాస అభ్యర్ధులను సిఎం కేసీఆర్ ఆదివారం ఖరారు చేశారు. రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్ రెడ్డి, నల్గొండ నుంచి తేరా చిన్నప్ప రెడ్డి, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పేర్లను ఖరారు చేశారు.
అంతేకాదు ఆ ముగ్గురు అభ్యర్ధుల గెలుపు కొరకు ఒక్కో జిల్లాకు నలుగురు చొప్పున ఇన్-ఛార్జ్ లను కూడా నియమించారు.
రంగారెడ్డి జిల్లాకు ప్రశాంత్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్లారెడ్డి, పద్మారావు.
నల్గొండ జిల్లాకు జగదీష్‌రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి
వరంగల్ జిల్లాకు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు.