హోంగార్డులు హ్యాపీ...హ్యాపీ

ఒకప్పుడు హోంగార్డు ఉద్యోగం అంటే చాలీచాలని జీతం, వెట్టి చాకిరీగా ఉండేది. హోంగార్డులు కూడా పోలీసులతో సమానంగా పనిచేస్తున్నా వారికి తగిన ప్రాధాన్యత, గుర్తింపు ఉండేవి కావు. కానీ సిఎం కేసీఆర్‌ పోలీస్ శాఖతో పాటు వారి సమస్యలను కూడా మానవతాదృక్పధంతో పరిష్కరించి గౌరవ వేతనాలను కూడా రెట్టింపు చేశారు. ఏప్రిల్ 2018 నుంచి వారి జీతాలను నెలకు రూ.21,000 చేశారు. అంతేకాదు... ప్రతీ నెల పోలీసులతో పాటు 1వ తేదీనే జీతాలు అందజేస్తోంది ప్రభుత్వం. ప్రతీ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి రూ.1,000 ఇంక్రిమెంటు ఇస్తామని సిఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే ఈనెలలో దానితో కలిపి హోంగార్డులు రూ.22,000 జీతాలు అందుకోవడంతో వారి ఆనందానికి హద్దులు లేవు. ఈ పెంపువలన పోలీస్ శాఖలో చేస్తున్న 20,000 మంది హోంగార్డులు లబ్ధిపొందారు.

పోలీస్ శాఖలో ఖాళీలు భర్తీ చేస్తున్నప్పుడు హోంగార్డులకు తొలి ప్రాధాన్యం ఇస్తూ వారికి కూడా రిజర్వేషన్లు కేటాయించారు. హోంగార్డుల జీతభత్యాల విషయంలో ఇంత మార్పు వచ్చింది గాబట్టే ఇప్పుడు ఉన్నత చదువులు చదివిన విద్యార్దులు సైతం హోంగార్డు ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తుకొంటున్నారు. హోంగార్డుల కష్టాన్ని గుర్తించి వారి శ్రమకు తగిన ఫలితం, గౌరవం అందించి వారి జీవితాలలో వెలుగులు నింపిన సిఎం కేసీఆర్‌కు అభినందనలు.