నేటి నుంచి జూరాలకు నీటి విడుదల

సిఎం కేసీఆర్‌ అభ్యర్ధన మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామీ నేటి సాయంత్రం నుంచి కర్ణాటకలోని నారాయణ్‌పూర్ ప్రాజెక్టు నుంచి తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు 2.5 టీఎంసీల నీటిని విడుదల చేయడానికి అంగీకరించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజల తాగునీటి అవసరాల కొరకు 2.5 టీఎంసీల నీటిని విడుదల చేయవలసింది కోరగా అందుకు కుమారస్వామి సానుకూలంగా స్పందించడమే కాకుండా శుక్రవారం సాయంత్రం  నుంచే నీటిని విడుదల చేయవలసిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సిఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రజల తరపున కుమారస్వామికి కృతజ్ఞతలు తెలిపారు.