
ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా 40 మంది అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్చులో ఉన్నారని లోక్‌సభ ఎన్నికల తరువాత ఏ క్షణంలోనైనా మమతా బెనర్జీ ప్రభుత్వం కుప్పకూలిపోవచ్చునని అన్నారు. దానిపై కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందిస్తూ, “ఈవిషయంలో ప్రధాని నరేంద్రమోడీకి కేసీఆరే ఆదర్శంగా నిలుస్తారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి వారిచేత పార్టీ ఫిరాయింపజేసే రాక్షసక్రీడా తెలంగాణలోనే మొదలైంది. అదిప్పుడు దేశమంతటా వ్యాపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాలను మోడీ ప్రభుత్వం కాపీ కొడుతోందో లేదో తెలియదు కానీ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపజేసి ప్రతిపక్షాలను దెబ్బతీయవచ్చుననే విషయం కేసీఆర్ దగ్గర నుంచే మోడీ నేర్చుకొన్నారు. అందుకే ఆవిదంగా అన్నారు. ఈ విష సంస్కృతికి అడ్డుకట్ట వేయవలసి ఉందంటూ విజయశాంతి ఫేస్‌బుక్‌లో ఒక బహిరంగ లేఖ పోస్ట్ చేశారు.