నేటి నుంచి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆమరణ దీక్ష

ఇంటర్మీడియెట్ బోర్డులో జరిగిన అవకతవకలకు నిరసనగా మంగళవారం బిజెపి ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌ ముట్టడిస్తామని ఆ పార్టీ అధికార ప్రతినిధి మురళీధర్ రావు తెలిపారు. అవకతవకలకు బాధ్యులైన బోర్డు కార్యదర్శి అశోక్, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డిని తక్షణమే పదవులలో నుంచి తొలగొంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకొన్న విద్యార్దుల ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలు పరిష్కరించేవరకు బిజెపి విశ్రమించబోదని చెప్పారు. బోర్డు అవకతవకలను నిరసిస్తూ, ఆత్మహత్యలు చేసుకొన్న విద్యార్దుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ    బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సోమవారం నుంచి ఆమరణ దీక్ష మొదలుపెడతారని మురళీధర్ రావు ప్రకటించారు.