4వ దశ పోలింగ్ షురూ

లోక్‌సభ 4వ దశ ఎన్నికలలో భాగంగా 9 రాష్ట్రాలలో మొత్తం 71 ఎంపీ స్థానాలకు సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలైంది. నేడు పశ్చిమబెంగాల్ (8సీట్లు), ఉత్తరప్రదేశ్ (13), మధ్యప్రదేశ్ (6), రాజస్థాన్ (13), ఒడిశా(6), ఝార్ఖండ్ (3), జమ్ముకశ్మీర్‌ (1) రాష్ట్రాలలో పోలింగ్ జరుగుతోంది. వీటితోపాటు జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ నియోజకవర్గంలో 2వ దశ పోలింగ్ జరుగుతుంది. 

ఈరోజు జరుగుతున్న పోలింగులో నటీమణులు ఊర్మిళా మతోండ్కర్, మూన్ మూన్ సేన్, రాజకీయ నాయకులలో సల్మాన్ ఖుర్షీద్, సుబాష్ భామ్రే, ఎస్ఎస్ అహ్లూవాలియా, గిరిరాజ్ సింగ్, పూనం మహాజన్, మిలిండ్ దేవ్‌రా, బాబుల్ సుప్రియో, కన్నయ్య కుమార్ తదితరుల భవిష్యత్తును ఓటర్లు నేడు తేల్చనున్నారు.