దళిత నేత రామగళ్ళ కృష్ణ మాదిగ మృతి

తెలంగాణ మలిదశ ఉద్యమనేత, తెరాస దళిత నాయకుడు రామగాళ్ల కృష్ణమాదిగ (46) శుక్రవారం కనుమూశారు. ఆయన గత నెలరోజులుగా కామెర్ల వ్యాదితో బాధపడుతున్నారు. నిన్న ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కుటుంబ సభ్యులు ఆయనను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సలహా మేరకు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు గాంధీ ఆసుపత్రి వైద్యులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. ఆయన మరణించిన సంగతి తెలుసుకొని దళిత సంఘాలు, పలువురు తెరాస నేతలు, మంత్రులు మల్కాజ్‌గిరిలోని ఆయన నివాసానికి వచ్చి ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. పలువురు నేతలు, దళిత సంఘాల నేతలు, కార్యకర్తలు ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు.