కోడ్ ముగియగానే రైతుబంధు నిధులు విడుదల

రాష్ట్రంలో ఇంకా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మే 23న అది ముగిసిన వెంటనే రైతుబంధు పధకం కింద నిధులు విడుదలచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఈసారి కూడా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలలోనే ఆ సొమ్మును జమా చేయబోతోంది. ఇప్పటివరకు ప్రభుత్వం ఎకరాకు, ఏడాదికి రూ.8,000 చొప్పున చెల్లిస్తోంది. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఈసారి నుంచి ఎకరాకు, ఏడాదికి రూ.10,000 చొప్పున చెల్లించబోతోంది. దీనికోసం బడ్జెట్‌లో రూ.12,000 కోట్లు కేటాయించింది కనుక చెల్లింపులకు ఎటువంటి ఇబ్బంది ఉండబోదు. గతంలోలాగే ఎటువంటి భూపరిమితులు విదించకుండా రాష్ట్రంలో వ్యవసాయభూమి ఉన్న ప్రతీ ఒక్కరికీ ఖరీఫ్ సీజను మొదలయ్యేలోగా రైతుబంధు సొమ్మును అందజేస్తామని వ్యవసాయశాఖ అధికారులు చెప్పారు.