సంబంధిత వార్తలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రూరల్ మండలంపరిధిలో జరుగబోయే ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. వేములవాడ రూరల్ మండలం పరిధిలో ఎంపీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్లు 2011 జనాభా ప్రాతిపాదికన లేవని, కనుక రిజర్వేషన్లు సవరించిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఎంపీపి రంగు వెంకటేష్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆయన వాదనలతో ఏకీభవిస్తూ, ఎన్నికలపై స్టే విధిస్తునట్లు ప్రకటించింది. రిజర్వేషన్ల కేటాయింపూలను పునః పరిశీలించిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.