సంబంధిత వార్తలు

చేవెళ్ళ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్ధిగా పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డికి నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్‌పై నిరాకరించడంతో ఆయన తరపు న్యాయవాది శుక్రవారం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయనకు నోటీస్ ఇవ్వడానికి వెళ్ళిన పోలీస్ ఎస్సై, హెడ్ కానిస్టేబుల్‌ను నిర్బందించి దూషించినట్లు వారు ఫిర్యాదు చేయడం ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి భావిస్తుండటంతో ముందస్తు బెయిల్‌పై కోసం మళ్ళీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు ఏమి చెపుతుందో అప్పుడు ఆయన ఏమి చేస్తారో చూడాలి.