వరంగల్ కొత్త మేయర్ ఎవరంటే...


వరంగల్ మేయర్ పదవికి గుండా ప్రకాష్ రావును తెరాస ఖరారు చేసింది. వరంగల్ మేయర్‌గా వ్యవహరిస్తున్న నన్నపునేని నరేందర్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఆయన మేయర్ పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో గూండా మహేష్ కు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అవకాశం కల్పించారు. ఈనెల 27న వరంగల్ మేయర్ పదవికి ఎన్నిక జరుగనుంది. 2016, మార్చి6న జరిగిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కార్పొరేషన్ పరిధిలో గల 58 వార్డులలో 44 వార్డులను తెరాస గెలుచుకొంది. కనుక గూండా మహేష్ ఎన్నిక లాంఛనప్రాయమేనని చెప్పవచ్చు.