పీవీ ఎక్స్‌ప్రెస్‌వే పాక్షికంగా మూసివేత

హైదరాబాద్‌వాసులకు గమనిక. హైదరాబాద్‌ లోని పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వేను మరమత్తుల కోసం కొన్ని రోజులు పాక్షికంగా మూసివేస్తున్నట్లు జిఎంఆర్ సంస్థ ప్రతినిధి ప్రశాంత్ మీడియాకు తెలిపారు. కనుక ఆ మార్గంలో ప్రయాణించేవారు వేరే మార్గాలను ఉపయోగించుకోవాలని చెప్పారు. అయితే మోహిదీపట్నం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయంవైపు వెళ్ళే ఎక్స్‌ప్రెస్‌వే మాత్రం తెరిచే ఉంటుందని కనుక ఆమార్గంలో వాహనాలు యధావిధిగా ప్రయాణించవచ్చునని తెలిపారు.  మరమత్తులు పూర్తయ్యేందుకు కనీసం వారం రోజులు పట్టవచ్చునని సమాచారం.