1.jpg)
బిజెపి సికిందరాబాద్ అభ్యర్ధి కిషన్‌రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఎంఏ ముఖీద్ అనే ఒక న్యాయవాది, గుర్రుం పవన్ కుమార్ గౌడ్ అనే ఒక వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు.
సోమవారం ఉదయం నగరంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనికీలు చేస్తున్నప్పుడు బిజెపికి చెందిన ఒక వాహనంలో రూ.8కోట్లు నగదు పట్టుబడిన సంగతి తెలిసిందే. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె లక్ష్మణ్ నారాయణగూడ ఇండియన్ బ్యాంక్ బ్రాంచి నుంచి సెల్ఫ్ చెక్ ద్వారా ఆ డబ్బును డ్రా చేసినట్లు పోలీసులు కనుగొన్నారు.
ఎన్నికల నిబందనలు అమలులో ఉన్నప్పుడు రూ.2 లక్షలకు మించి బ్యాంక్ నుంచి విత్ డ్రా చేయడానికి వీలులేదు. కానీ కె లక్ష్మణ్ ఏకంగా రూ.8 కోట్లు డ్రా చేశారు. బిజెపి కార్యాలయ సిబ్బంది వద్ద పట్టుబడిన ఆ డబ్బు సికిందరాబాద్ నియోజకవర్గంలో ఓటర్లకు పంచిపెట్టడానికేనని పిటిషనర్స్ ఆరోపించారు. బ్యాంకు నుంచి ఒకేసారి అంత మొత్తం డబ్బు డ్రా చేయడం, దానిని ఓటర్లకు పంచిపెట్టాలనుకోవడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే కనుక కిషన్‌రెడ్డిని ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హుడిగా ప్రకటించాలని పిటిషనర్లు కోరారు. వారి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ కేసుపై శుక్రవారం విచారణ చేపట్టే ఆవకాశం ఉంది.