
ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి రమేశ్ రాథోడ్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఆయన జైనూర్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకొని ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి కారులో తిరిగి వస్తుండగా మావల అనే ప్రాంతంలో గల సిమెంటు పైపుల కంపెనీ వద్ద ఒక అడవి పంది హటాత్తుగా రోడ్డుపైకి వచ్చింది. దానిని తప్పించబోతే కారు అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టును డ్డీ కొట్టడంతో కారులో ఉన్న రమేశ్ రాథోడ్‌కు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో రమేశ్ రాథోడ్ తల, పక్కటెముకలకు గాయాలయ్యాయి. స్థానికులు ఆయనను సకాలంలో రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేయడంతో రమేశ్ రాథోడ్ ప్రాణాపాయం తప్పింది. కారు డ్రైవరుకు కూడా స్వల్పగాయాలయ్యాయి.