.jpg)
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కరీంనగర్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్ధి పొన్నం ప్రభాకర్ సోమవారం ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, “నేను పార్టీ మారబోతున్నానంటూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మవద్దు. తెరాస మైండ్ గేమ్ లో భాగంగా అటువంటి ప్రచారం జరుగుతోందని భావిస్తున్నాను. నేను ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీని వీడబోను. పార్టీ మారబోనని అఫిడవిట్ ఇవ్వడానికి కూడా నేను సిద్దం,” అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి నమ్మకమైన నేతలలో పొన్నం ప్రభాకర్ కూడా ఒకరు. ఒకవేళ లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోతే, కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ స్థాయిలో వలసలు మొదలవవచ్చు కానీ అప్పుడూ పొన్నం ప్రభాకర్ పార్టీ మారకపోవచ్చు.