నిజామాబాద్‌ ఎన్నికలపై హైకోర్టు తీర్పు...

నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికల నిర్వహణలో జోక్యం చేసుకోలేమని, ప్రస్తుత పరిస్థితిలో ఎన్నికలపై స్టే మంజూరు చేయలేమని హైకోర్టు సోమవారం తేల్చిచెప్పింది. 

నిజామాబాద్‌ నుంచి స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేస్తున్నవారిలో 176 మంది పసుపు, ఎర్రజొన్న రైతులున్నారు. ఎన్నికల ప్రచారం గడువు ముగుస్తున్నప్పటికీ ఇంతవరకు తమకు ఎన్నికల గుర్తులు కేటాయించలేదని, ఆ కారణంగా ఎన్నికల ప్రచారం చేసుకోలేకపోయామని  కనుక నిజామాబాద్‌ నియోజకవర్గంలో 2వ దశ ఎన్నికలతో కలిపి నిర్వహించాలని కోరుతూ 16 మంది రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈవీఎంల బదులు బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని వారు హైకోర్టును అభ్యర్ధించారు. కానీ ఊహించినట్లుగానే, ఈదశలో తాము ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు చెప్పడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. హైకోర్టు తాజా తీర్పుతో నిజామాబాద్‌లో 12 ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చురుకుగా ఏర్పాట్లు చేస్తోంది.