నేడు ఎల్బీ స్టేడియం వద్ద ట్రాఫిక్ మళ్లింపు

ఈరోజు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జనసేన బహిరంగసభ జరుగబోతున్నందున ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విదిస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీస్ అధనపు కమీషనర్ అనిల్ కుమార్ తెలిపారు. ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ను ఇతర మార్గాలలోకి మళ్ళిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని అనిల్ కుమార్ తెలిపారు.  

బషీర్‌బాగ్‌ జంక్షన్‌ నుంచి జీపీఓకు వెళ్ళే వాహనాలను బషీర్‌బాగ్‌ జంక్షన్‌ నుంచి హైదర్‌గూడ, కింగ్‌కోఠి వైపు మళ్ళిస్తారు. హిల్‌ ఫోర్టు నుంచి వచ్చే వాహనాలను పీసీఆర్‌ జంక్షన్‌ మీదుగా నాంపల్లి రోడ్డువైపు మళ్ళిస్తారు. 

కింగ్‌కోఠి నుంచి బషీర్‌బాగ్‌కు వచ్చే వాహనాలను భారతీయ విద్యాభవన్‌ వద్ద కింగ్‌కోఠి క్రాసు రోడ్డు వైపు అనుమతిస్తారు. ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూం నుంచి బషీర్‌బాగ్‌కు వెళ్ళే వాహనాలను నాంపల్లి మార్గంలో పంపిస్తారు.

అబిడ్స్, గన్‌ఫౌండ్రి నుంచి వచ్చే వాహనాలను ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రి  నుంచి చాపేల్‌ రోడ్డులో అనుమతిస్తారు. పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్‌ జంక్షన్‌ వైపునకు మళ్ళిస్తారు.

అంబేద్కర్‌ విగ్రహం వైపు నుంచి వచ్చే వాహనాలను లిబర్టీ జంక్షన్‌ నుంచి హిమాయత్‌నగర్‌ రోడ్డులో అనుమతిస్తారు.

రాజమోహల్లా రోడ్డు నుంచి వచ్చే వాహనాలను పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి కింగ్‌ కోఠి, నారాయాణగూడ వైపున పంపిస్తారు.

కనుక నగరవాసులు ఈ ట్రాఫిక్ ఆంక్షలను గుర్తుంచుకొని వేరే మార్గాల తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని అనిల్ కుమార్ సూచించారు.