సంబంధిత వార్తలు

నిజామాబాద్ లోక్సభ స్థానానికి 185 మంది నామినేషన్లు వేయడంతో బ్యాలెట్ పేపర్లతో పోలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ చెప్పారు. కానీ ఈవీఎంలతోనే పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. కనుక నిజామాబాద్ నియోజకవర్గానికి 26,280 ఈవీఎంలు, 21,240 కంట్రోల్ యూనిట్లు, 2,600 వివి ప్యాట్ మెషిన్లను సరఫరా చేయాలని నిర్ణయించింది. నిజామాబాద్ ఓటర్లకు ఇది పరీక్ష వంటిదేనాని చెప్పవచ్చు. 185 మంది అభ్యర్ధుల జాబితాలో తాము కోరుకొన్న అభ్యర్ధి పేరును, గుర్తును గుర్తించి ఎన్నుకోవడం కొంచెం కష్టమే.