ఖమ్మంలో కోటీశ్వరుల మద్య పోటీ

లోక్‌సభ ఎన్నికలలో ఖమ్మం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా రేణుకా చౌదరి, తెరాస అభ్యర్ధిగా పోటీ పడుతున్నారు. ఇద్దరికీ 100 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించిన నామినేషన్ పత్రాలతో బాటు తమతమ ఆస్తుల వివరాలు కూడా సమర్పించారు.   

రేణుకా చౌదరి మొత్తం ఆస్తుల విలువ రూ. 144 కోట్లు కాగా, నామా నాగేశ్వర రావు ఆస్తుల విలువ 130.50 కోట్లుగా అఫిడవిట్లోలో పేర్కొన్నారు.

రేణుకా చౌదరి భర్త శ్రీధర్ చౌదరివి కలిపి స్థిరాస్తుల విలువ: 46.81 కోట్లు, చరాస్తులు: రూ.97.18 కోట్లు, అవి కాక భర్తకు మరో రూ.11.61 కోట్లు ఇతర ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. 

 నామా నాగేశ్వరరావు కుటుంబానికి స్థిరాస్తులు: రూ.52.11 కోట్లు, చరాస్తులు: రూ. 78.39 కోట్లు, అప్పులు: 11.61 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.  

వారిరువురితో పోలిస్తే సికిందరాబాద్‌ నుంచి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్ధి కిషన్ రెడ్డికి చాలా తక్కువ ఆస్తులు ఉన్నట్లే లెక్క. కానీ ఆయన కూడా కోటీశ్వరుడే. ఆయనకు మొత్తం రూ.8.09 కోట్లు ఆస్తి ఉంది. దానిలో  స్థిరాస్తుల విలువ: రూ. 6.37 కోట్లు, చరాస్తులు: రూ.4.42 కోట్లు ఉన్నాయి. భార్యకు రూ.25 లక్షలు అప్పు తిరిగి చెల్లించవలసి ఉందని పేర్కొన్నారు.