
భారత్-పాక్ మద్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ఇరుదేశాల పౌరవిమాన సేవలు, విమానాశ్రయాలపై కూడా పడింది. భారత్ నుంచి పాకిస్థాన్ మీదుగా వెళ్లవలసిన పలుఅంతర్జాతీయ విమానాలను సురక్షితమైన వేరే మార్గం గుండా పంపిస్తున్నారు. అలాగే శంషాబాద్ విమానాశ్రయంతో సహా దేశంలోని పలు విమానాశ్రయాల నుంచి సరిహద్దు రాష్ట్రాలకు వెళ్ళే పలు విమానాలను రద్దు చేశారు. ప్రధానంగా అమృత్ సర్, డెహ్రాడూన్, గురువారం గావ్, ఛండీఘడ్, శ్రీనగర్ వెళ్ళే విమానాలు రద్దు చేశారు. పంజాబ్, జమ్ముకశ్మీర్‌లోని విమానాశ్రయాల నుంచి పౌరవిమానాల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి.
పాకిస్థాన్‌లో కూడా ఇస్లామాబాద్ తో సహా పలు జాతీయా అంతర్జాతీయ విమానాశ్రయాలను మూసివేశారు. కొన్ని విమానాశ్రయాలను పాక్ వాయుసేన తమ అధీనంలో తీసుకొన్నట్లు సమాచారం.