భారత్‌ గగనతలంలో ప్రవేశించిన పాక్‌ యుద్దవిమానాలు

భారత్‌ వాయుసేనదాడులతో అటు పాక్‌ ప్రజల నుంచి, పార్లమెంటులో ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్‌ ప్రభుత్వం ఆ అవమానకర పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఈరోజు ఉదయం చిన్న దుస్సాహాసం చేసింది. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలోని సరిహద్దుప్రాంతమైన నౌషేరా సెక్టారులో పాక్‌ వాయుసేనకు చెందిన యుద్దవిమానాలు ప్రవేశించాయి. అటువంటి పరిణామాలకు ముందే సిద్దంగా ఉన్న భారత్‌ వాయుసేన వాటిని వెంటనే తరిమికొట్టింది. కానీ పాక్‌ యుద్దవిమానాలు తిరిగి వెళ్లిపోతూ కొన్ని బాంబులను జారవిడిచాయి. వాటి దాడిలో ఆస్తినష్టం లేదా ప్రాణనష్టం ఏమైనా జరిగిందో లేదో ఇంకా తెలియవలసి ఉంది.