
పాకిస్థాన్‌కు భారత్ పెద్ద షాక్ ఇచ్చింది. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు భారత వాయుసేనకు చెందిన 12 మీరాజ్ యుద్ధవిమానాలు వాస్తవాధీనరేఖను దాటి పాక్ భూభాగంలోకి ప్రవేశించి అక్కడ తిష్టవేసున్న ఉగ్రవాద శిభిరాలపై సుమారు 1,000 కేజీల బాంబుల వర్షం కురిపించి వాటిని నాశనం చేసి సురక్షితంగా తిరిగి తమ స్థావరాలకు చేరుకొన్నాయి.
అయితే పాక్ ఇంటర్ సర్వీసస్ పబ్లిక్ రిలేషన్స్ చీఫ్ మేజర్ జనరల్ ఆసీఫ్ గఫూర్, “భారత వాయుసేనకు చెందిన యుద్ధవిమానాలు మా సరిహద్దులలోకి ప్రవేశించబోతే మా వాయుసేన వెంటనే స్పందించి ఎదురుదాడి చేయడంతో భారత వాయుసేన విమానాలు వెనక్కు వెళ్లిపోయాయి. వాటిలో ఒకటి తప్పించుకొని పారిపోయేటప్పుడు బాల్కోట్ వద్ద ఒక బాంబును జారవిడిచింది,” అని ట్వీట్ చేశారు.