బీజేపి సీనియర్ నేత బద్ధం బాల్ రెడ్డి కన్నుమూత

బీజేపి సీనియర్ నేత బద్ధం బాల్ రెడ్డి (73) బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ లో శనివారం మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బాల్ రెడ్డి శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా పేగు సంబంధిత క్యాన్సర్ తో బాధపడుతున్న బాల్ రెడ్డి ఫిబ్రవరి 10 నుండి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన బాల్ రెడ్డి పాతబస్తి రాజకీయాల్లో తన ముద్ర వేశారు. అలియాబాద్ జంగమ్మెట్ కు చెందిన బాల్ రెడ్డి బీజేపి బలోపేతానికి విశేషంగా కృషి చేశారు అందుకే ఆయన్ను గోల్కొండ టైగర్ అని పిలుచుకుంటారు. 

తెలంగాణాలో బీజేపి అభివృద్ధికి బాల్ రెడ్డి ఎంతో కృషి చేశారు. ఇటీవల జరిగిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుండి పోటీ చేశారు బద్ధం బాల్ రెడ్డి. బాల్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావు సంతాపం తెలియచేశారు. బీజేపి ఎమ్మెల్యే రాజా సింగ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ బాల్ రెడ్డి భౌతికకాయానికి నివాళి అర్పించారు.