సంబంధిత వార్తలు

రాజకీయ నేతలలో నందమూరి బాలకృష్ణ రూటే సపరేటు. నంద్యాల ఉప ఎన్నికలలో రోడ్ షో చేస్తున్నప్పుడు మీడియా సమక్షంలోనే ప్రజలకు డబ్బులు పంచారు. చట్టాలకు తాను అతీతుడినని బాలకృష్ణ భావించి ఉండవచ్చు కానీ ఆవిధంగా డబ్బు పంచడం ఎన్నికల నియామావళిని ఉల్లంఘించడమేనని కనుక ఆయనపై ప్రజాప్రాతినిద్య చట్ట నిబందనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శివకుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన హైకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టి, బాలకృష్ణకు, కేంద్ర ఎన్నికల సంఘానికి కౌంటరు దాఖలు చేయాలాని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.