కృష్ణాజిల్లాలో టిఎస్ ఆర్టీసీ బస్సులో మంటలు

 హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెలుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సులో ఈరోజు తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఇబ్రహీంపట్నం చేరుకొనేసరికి బస్సు వెనుకభాగం నుంచి పొగలు రావడం మొదలయ్యాయి. అది గమనించిన బస్సు డ్రైవరు వెంటనే బస్సును నిలిపివేసి ప్రయాణికులను హెచ్చరించడంతో అందరూ బస్సులో నుంచి దిగిపోయారు. బస్సు డ్రైవరు సకాలంలో గుర్తించి బస్సును నిలిపివేయడంతో మంటలు చెలరేగకుండా నివారించగలిగారు. సమాచారం అందుకొన్న టిఎస్ ఆర్టీసీ అధికారులు తక్షణమే విజయవాడ డిపో నుంచి మరో బస్సును ఏర్పాటు చేసి ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చారు. బస్సులో తలెత్తిన సాంకేతిక లోపాన్ని సవరించి అవసరమైన మరమత్తులు చేయించడానికి విజయవాడ డిపోకు తరలించారు.