ఏ మంత్రికి ఏ శాఖ లభించిందంటే...

ఈరోజు ఉదయం ప్రమాణస్వీకారం చేసిన 10 మంది మంత్రులకు సిఎం కేసీఆర్‌ కొద్ది సేపటి క్రితం శాఖలు కేటాయించారు. అయితే మీడియాలో వచ్చిన ఊహాగానాలకు కాస్త భిన్నంగా కేటాయింపులు చేయడం విశేషం. గత ప్రభుత్వంలో ఆర్ధికమంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌కు ఈసారి వైద్య ఆరోగ్య శాఖను కేటాయించి, ఆర్ధిక శాఖను సిఎం కేసీఆర్‌ తనవద్దే ఉంచుకోవడం విశేషం.  

ఈటల రాజేందర్‌: వైద్య ఆరోగ్యశాఖ 

జగదీష్ రెడ్డి: విద్యాశాఖ 

ఇంద్రకరణ్ రెడ్డి: న్యాయ, అటవీ, దేవాదాయ శాఖలు 

తలసాని శ్రీనివాస్ యాదవ్: పశుసంవర్ధక శాఖ 

కొప్పుల ఈశ్వర్: సంక్షేమ శాఖలు

ఎర్రబెల్లి దయాకర్ రావు: పంచాయతీరాజ్ శాఖ 

శ్రీనివాస్ గౌడ్: ఎక్సైజ్, పర్యాటక శాఖలు

నిరంజన్ రెడ్డి: వ్యవసాయ శాఖ

ప్రశాంత్ రెడ్డి: రోడ్లు భవనాలు

మల్లారెడ్డి: కార్మిక శాఖ