ఏపీ బడ్జెట్‌ రూ.2.27 లక్షల కోట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధికమంత్రి మంగళవారం ఉదయం 2019-20 సం.లకు ఓట్-ఆన్‌-అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ అంచనాలు రూ.2,26,117.53 కోట్లు. రెవెన్యూ వ్యయం: రూ.1,80,369.33 కోట్లు/ మూలధన వ్యయం: రూ. 29,596.68 కోట్లు. రెవెన్యూ మిగిలు: రూ.2099.47 కోట్లు కాగా ఆర్ధికలోటు రూ.32,390.68 కోట్లు అని పేర్కొన్నారు.  

తీవ్ర ఆర్ధిక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ అన్ని రంగాలలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి సాధిస్తోందని మంత్రి రామకృష్ణుడు అన్నారు. 

ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.1,000 నిరుద్యోగభృతి ఇస్తోంది. దానిని రెట్టింపు చేస్తున్నట్లు మంత్రి యనమల ప్రకటించారు. వృద్ధాప్య, వితంతు మహిళలు, వికలాంగులకు పింఛన్లు రెట్టింపు చేసినట్లు తెలిపారు. వాటి చెల్లింపుల కోసం బడ్జెట్‌లో రూ.10,401 కోట్లు నిధులు కేటాయించారు. రాష్ట్రంలో కొత్తగా డ్రైవర్స్ సాధికార సంస్థను ఏర్పాటు చేసి దానికి రూ.150 కోట్లు మూలధనం కేటాయించినట్లు మంత్రి యనమల తెలిపారు. 

బడ్జెట్‌లో ముఖ్య శాఖలకు కేటాయింపులు: 

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి: రూ.35,182 కోట్లు

సెకండరీ ఎడ్యుకేషన్: రూ.22,783 కోట్లు

జలవనరుల శాఖ: రూ.16,852 కోట్లు 

వ్యవసాయ రంగానికి: రూ.12,732 కోట్లు 

వైద్య, ఆరోగ్య శాఖ: రూ. 10,132 కోట్లు 

ఉన్నత విద్య: రూ.3,171 కోట్లు

బీసీ వెల్ఫేర్: రూ. 8,242 కోట్లు

ఎస్సీ సబ్ ప్లాన్ కింద: రూ. 14,367 కోట్లు

ఎస్టీ సబ్ ప్లాన్ కింద: రూ. 5,385 కోట్లు

బీసీ సబ్ ప్లాన్ కింద: రూ. 16,226 కోట్లు

మైనార్టీ సబ్ ప్లాన్ కింద: రూ.1,304 కోట్లు