
ముఖ్యమంత్రి కేసీఆర్ రెండవసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తరువాత మొట్టమొదటిసారిగా ఆదివారం ఉదయం యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోబోతున్నారు. రేపు ఉదయం 10.30 గంటలకు యాదాద్రి చేరుకొని మొదట స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం యాదాద్రిలో ప్రధాన ఆలయం, బాలమంటపం, వ్రతమంటపం, శివాలయం జరుగుతున్న నిర్మాణపనులను పరిశీలిస్తారు. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను, తెలంగాణ ఉద్యమాల చరిత్రను చాటి చెప్పేవిధంగా ఆలయం ప్రాంగణంలో స్తంభాలపై చెక్కుతున్న శిల్పాలను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు సలహాలు ఇస్తారు.
తెలంగాణ ఏర్పడి తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత సిఎం కేసీఆర్ యదాద్రి ఆలయానికి ఏటా బడ్జెట్‌లో కోట్లాది రూపాయలు కేటాయిస్తూ, స్వయంగా అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నందున శరవేగంగా చాలా అద్భుతంగా ఆలయనిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఏటా యాదాద్రి ఆలాయన్ని దర్శించుకునే భక్తులు నానాటికీ అపురూపంగా రూపుదిద్దుకొంటున్న ఆలయాన్ని చూసి మురిసిపోతున్నారు.