నేటి నుంచి పంచాయతీ పాలన షురూ

నేటి నుంచి రాష్ట్రంలో కొత్త పంచాయతీలు కొలువు తీరనున్నాయి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 12,680 పంచాయితీలలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ప్రమాణస్వీకారాలు చేస్తారు. అనంతరం మొట్టమొదటి పంచాయతీ సమావేశాలు నిర్వహించుకుంటారు. ఈసారి కొత్తగా 4,380 పంచాయతీలు ఏర్పాటయ్యాయి. వాటిలో తొలిసారిగా సర్పంచ్‌లుగా బాధ్యతలు చేపడుతున్నవారికి పంచాయతీ చట్టాలు, పాలనపై అవగాహన ఉండదు కనుక సోమవారం నుంచి వారితో సహా మొత్తం 12,680 మంది సర్పంచ్‌లకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. సిఎం కేసీఆర్‌ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.